: ఏసీబీ డీజీగా ఏకే ఖాన్ కు అదనపు బాధ్యతలు
ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకే ఖాన్ కు ఎసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాదరావు డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఎసీబీ డీజీ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఏకే ఖాన్ కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.