: 'భారతరత్న' నా తల్లికి అంకితం: సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడ్కోలు బాధలో ఉండగా కేంద్రం సముచితంగా సత్కరించింది. కేంద్రం తనకు 'భారతరత్న' ప్రకటించడంపై సచిన్ హర్షం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత పౌర పురస్కారం తనకు ప్రకటించడం పట్ల కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తన తల్లికి అంకితమిస్తున్నట్టు ఆయన చెప్పారు.