: జమ్మూ కాశ్మీర్ లో భూకంపం
జమ్మూ కాశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారు జామున భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. భూకంపతీవ్రత రిక్టర్ స్కేలుపై 4 గా నమోదైందని తెలిపారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాని సంభవించినట్టు తమకు సమాచారం లేదని అన్నారు.