: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య


అత్యాధునిక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రోజు అధికారికంగా భారత నావికాదళంలో చేరింది. దశాబ్దకాలంగా అనేక చర్చలు, పలు మార్పుల అనంతరం విక్రమాదిత్య ఇండయన్ నేవీలో చేరింది. ఎయిర్ క్రాఫ్ట్ లను మోసుకెళ్లే వాహక నౌక ఇది. ఈ నౌకను రష్యా తయారుచేసింది. ఆర్కిటిక్ పోర్ట్ అయిన సెవెరోద్విన్స్క్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నౌకను భారత్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రి పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇది హిందూ మహాసముద్రంలో పూర్తి స్థాయిలో కాపలా కాస్తుంది. ఈ నౌకను రష్యా నుంచి భారత్ 947 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

  • Loading...

More Telugu News