: మాట తప్పితే ట్రాన్స్ కో కార్యాలయం దిగ్బంధిస్తాం: హరీష్ రావు
వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ట్రాన్స్ కో సీఎండీ మాట తప్పితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ట్రాన్స్ కో కార్యాలయాన్ని దిగ్భంధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లా చిత్తూరుకు 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ, తెలంగాణ జిల్లాల్లో కోత విధిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.