: రచ్చబండను సీఎం దుర్వినియోగం చేస్తున్నారు : జీవన్ రెడ్డి


ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్ దుర్వినియోగపరుస్తున్నారని టి.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత కిరణ్ రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు.

  • Loading...

More Telugu News