: సమైక్య నినాదాలు ఢిల్లీకి వినిపించాలి: సీఎం కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య వాదం వినిపించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విభజనకు అనుకూలంగా లేరని అన్నారు. సమైక్యంగా ఉన్నందునే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టించుకున్నామని, విభజనతో ప్రాజెక్టులను ఎలా విభజిస్తారో తెలిపాలని డిమాండ్ చేశారు. సమైక్య నినాదాలు ఢిల్లీకి వినిపించాలంటూ ఆయన సభికులను ఉత్తేజపరిచారు. 50 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 9 లక్షల డ్వాక్రా గ్రూపులకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామని ఆయన అన్నారు.