: ఆపరేటర్ నిబంధనల అతిక్రమణ వల్లే వోల్వో బస్సు ప్రమాదం
కర్ణాటకలో నేషనల్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దహనం కేసులో దర్యాప్తు బృందం వాస్తవాలను గుర్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. బస్సు ఆపరేటర్ అయిన నేషనల్ ట్రావెల్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బెల్గాం ఐజీపీ భాస్కర్ రావు తెలిపారు. అధిక వేగం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. రెండో డ్రైవర్ నవాజ్ పాషా బస్సులో లగేజీ పెట్టే చోట నిద్రించాడని, మొదటగా దహనమైనది అతడేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సు డిజైన్ కు విరుద్ధంగా డ్రైవర్ పక్కన సీటు ఏర్పాటు చేశారని.. అక్కడ క్లీనర్ కూర్చుంటాడని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రయాణికులు తప్పించుకునే వీల్లేకుండా ఆ సీటు మార్గానికి అడ్డుపడిందని వివరించారు.