: ఉద్యమం ఆరిపోయిన దీపం కాదు, రగులుతున్న జ్వాల: లగడపాటి
ఉద్యమం ఆరిపోయిన దీపం కాదని, రగులుతున్న జ్వాల అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉద్యమం ఆగిపోయిందని పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి నిజం కాదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే చుక్క నీరు కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇంతవరకు జరిగిన ఉద్యమం ట్రైలర్ మాత్రమేనని, ఇకపై జరిగే ఉద్యమం అసలు ఉద్యమమని లగడపాటి పేర్కొన్నారు.