: దేశానికి సేవ చేయండి, గర్వపడేలా ఆడండి: సచిన్
సచిన్ వీడ్కోలు సందర్భంగా సహచరులకు, భావి తరాల క్రికెటర్లకు మర్చిపోలేని సందేశాన్నిచ్చాడు. 'దేశానికి ఆట ద్వారా సేవ చేయండి.. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావించండి. క్రికెట్ ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి' అని కోరాడు. దేశానికి ప్రతినిథులుగా నిలవడం జీవితంలోనే అత్యుత్తమమైనదని సచిన్ తన సహచరులకు సూచించాడు.