: ఒపీనియన్ పోల్స్ నిషేధంపై చట్టం చేయాలని కేంద్రాన్ని కోరిన ఈసీ


ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేయకుండా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కోరింది. ఈ మేరకు ఒక లేఖను కేంద్ర న్యాయ శాఖకు పంపింది. 15 జాతీయ, ప్రాంతీయ పార్టీలలో 14 పార్టీలు ఒపీనియన్ పోల్స్ ను నిషేధించాలని కోరిన విషయం తెలిసిందే. ఒక్క బీజేపీ మాత్రమే నిషేధాన్ని వ్యతిరేకిస్తోంది. ఒపీనియన్ పోల్స్ పై నిషేధం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News