: ఈసీకి వివరణ ఇచ్చేందుకు సమయం కావాలి : బీజేపీ
నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చేందుకు వారం రోజుల సమయం కావాలని బీజేపీ కోరింది. ఓ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ గుర్తును ఉద్దేశించి... రక్తహస్తాలంటూ మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ఈసీ బుధవారం మోడీకి నోటీసులు పంపింది. నవంబరు 16లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీనిపై వివరణ ఇవ్వడానికి వారం రోజుల సమయం అవసరమని బీజేపీ కోరింది.