: రేపు కూడా హస్తినలోనే ముఖ్యమంత్రి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన రేపు కూడా కొనసాగనుంది. మంగళవారం ఢిల్లీలో ఉండనున్న ముఖ్యమంత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం నుంచి ఢిల్లీలో ఆయన పలువురు ప్రముఖులను కలుస్తూనే ఉన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆజాద్ లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలుసుకున్నారు. 
తెలంగాణ అంశం, సహకార ఎన్నికలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి వంటి పలు ఆసక్తికర అంశాలపై వీరితో చర్చించినట్లు సమాచారం. రేపు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండి ప్రధానిని కలవనున్నారు. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది. 

  • Loading...

More Telugu News