: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో నేడు ఆరో రౌండ్
చెన్నైలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో నేడు ఆరో రౌండ్ మ్యాచ్ జరగనుంది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆనంద్, ప్రపంచ నెంబర్ వన్ కార్ల్ సన్ మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో... ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ముగిశాయి. నిన్న జరిగిన ఐదో మ్యాచ్ లో కార్ల్ సన్ విజయం సాధించి 3-2 ఆధిక్యతలోకి దూసుకుపోయాడు. ఈ రోజు జరగనున్న ఆరో గేమ్ లో ఆనంద్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ మెగా టోర్నీలో మరో ఏడు గేమ్ లు మిగిలి ఉన్నాయి.