: ఓటమికి చేరువలో విండీస్.. 90/6
వెస్టిండీస్ రెండో టెస్టులో ఓటమికి చేరువైంది. 3 వికెట్ల నష్టానికి 43పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఆట ప్రారంభించిన విండీస్ ను స్పిన్నర్ ఓజా దెబ్బతీశాడు. వరుసగా మూడు వికెట్లు తీశాడు. శామ్యూల్స్(11), క్రిస్ గేల్(35), డియోనరైన్ ను అవుట్ చేశాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులతో విండీస్ కష్టాల్లో పడిపోయింది. చందర్ పాల్, రాందిన్ క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ సాధించిన 313 పరుగుల ఆధిక్యాన్ని ఛేదించడం విండీస్ కు అసాధ్యంగా మారింది. రెండో ఇన్సింగ్స్ ఆడేందుకు దాదాపుగా అవకాశం లేకపోవడంతో సచిన్ ఆట చూసే అవకాశం అభిమానులకు లేనట్లే.