: ఆరు సెకన్లకు ఒకరు షుగరుతో టపా కట్టేస్తున్నారు!


ప్రతి ఆరు సెకన్లకు ఒకరు షుగరు వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధి బారినపడి బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ నివేదిక ప్రకారం ప్రతి ఆరు సెకన్లకు ఒకరు షుగరు వ్యాధి బారిన పడి మృత్యువు ఒడిలోకి చేరుతున్నారట. కొందరు ఈ వ్యాధి గురించి సరిగా తెలియకుండా మృత్యువుకు చేరువవుతుండగా, మరికొందరు సరైన ఆహార నియమాలను పాటించకుండా మరణిస్తున్నారు. ఈ వ్యాధికి పెద్ద పెద్ద సెలబ్రిటీలనుండి మామూలు సామాన్యుల వరకూ అందరూ గురవుతున్నారు. అందుకే ప్రజలకు షుగరు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ నిర్వహించదలచింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా షుగరు వ్యాధికి గురయ్యేవారి శాతం ప్రపంచ జనాభా పెరుగుదల రేటుకన్నా ఎక్కువగా పెరుగుతోందట. షుగరు వ్యాధి రావడానికి ఎక్కువగా సరైన ఆహార నియమాలు లేకపోవడం, క్రమబద్ధమైన జీవన శైలి లేకపోవడం, శరీరానికి తగు వ్యాయామం లేని కారణంగా వచ్చే స్థూల కాయం... ఇలా పలు రకాల కారణాలను చెప్పవచ్చు. కాబట్టి ఆహారంలో తగు మార్పులు చేసుకుని, వ్యాయామం చేయడం, స్థూల కాయం తగ్గించుకోవడం వంటివి చేసుకోవడం వల్ల షుగరు వ్యాధిని దూరంగా ఉంచే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News