: టమోటా చేతిలో మన ఆరోగ్యం


మనం వంటకాల్లో ఎక్కువగా వాడే టమోటాలో బోలెడన్ని సుగుణాలున్నాయి. ఎర్రగా నోరూరించే టమోటాలను కొందరు పచ్చివే తింటారు. ఇలా ఉదయాన్నే పచ్చిటమోటా పండ్లను తింటే మంచిదట. ఎర్రగా పండిన టమోటాల్లో ఉండే ఎ, సి విటమిన్లు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

రోజూ ఉదయం పూట ఒక టమోటాను తినడం వల్ల దానిలో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు మన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి టమోటాలు చక్కగా తోడ్పడతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు మూడు టమోటాలను తింటే రెండుమూడు నెలల్లోనే బరువు తగ్గుతారట. శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పండ్ల ద్వారా లభిస్తాయి. షుగరు రోగులు వీటిని రోజూ తీసుకోవడం వల్ల మంచి పలితాలను పొందవచ్చు. కూరలు చేయడానికి పెద్దగా సమయం లేకపోతే మనల్ని ఆదుకునేది టమోటా కూరే. చిటికెలో అయిపోయే ఈ కూరని ఎక్కువమంది ఇష్టంగా తింటారు. మరి టమోటాను ఎక్కువగా వాడి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

  • Loading...

More Telugu News