: బరువును అదుపులో ఉంచుకోవాలంటే...


మన బరువును అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో ఎక్కువ భాగం పండ్లను చేర్చుకోవాలట. ఇప్పుడు ఎక్కువమంది ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారు తమ ఆహారం మొత్తంలో ఎనభై శాతం పండ్లను, పది శాతం ప్రోటీన్లను, పది శాతం కొవ్వులు ఉండేలా చూసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోబాటు, బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పటి ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ మార్టినా నవ్రతిలోవా వంటి క్రీడాకారులు ఇలాంటి ఆహారంతోనే ఎంతో ఫిట్‌గా ఉంటూ తమ ఫిట్‌నెస్‌ను అంతకాలం పాటూ కాపాడుకుంటూ వచ్చారట. ఇలాంటి డైట్‌ను డాక్టర్‌ డగ్లస్‌ ఎం.గ్రహం రూపొందించారు. డగ్లస్‌ దీనిపై ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా రాశాడు. దీన్ని 80/10/10గా పిలుస్తారు. ఇలాంటి డైట్‌ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఆటగాళ్ల నైపుణ్యం మరింత మెరుగుపడుతుందని, శరీర బరువును అదుపులో ఉంచడంతోబాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతుందని గ్రహం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News