: నెల్లూరు జిల్లాలో సుమోను ఢీకొన్న లారీ: ఏడుగురు మృతి


నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఈ రోజు వేకువజామున సుమోను, లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు కడప జిల్లా రాయచోటి వాసులుగా గుర్తించారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News