: కొవ్వు తగ్గాలనుకుంటే కొబ్బరి తినండి


మన రోజువారీ జీవితంలో కొబ్బరికి కొంత ప్రాధాన్యతవుంది. పురాణ కాలం నుండి కొబ్బరిని పూజాది కార్యక్రమాలకు, ఎక్కువగా శుభకార్యాలకు కొబ్బరికాయలను ఉపయోగించడం జరుగుతూ వస్తోంది. అయితే మనం రోజూ తినే ఆహారంలో మాత్రం కొబ్బరిని చాలా తక్కువే వాడుతున్నాం. ఏదో కొద్దిమేర కొబ్బరిని తినడం వంటివి జరుగుతుంటుంది. అలాకాకుండా మనం రోజూ తీసుకునే ఆహారంలో కనీసం వంద గ్రాముల లేత కొబ్బరిని తీసుకోవాలట. ఎందుకంటే లేత కొబ్బరి ప్రోటీన్లు, కొవ్వు, ఖనిజాలు, కార్బొహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్‌, ఇంకా తేమ, ఐరన్‌ ఇవన్నీ పుష్కలంగా కలిగివుంటుంది.

మనం లేత కొబ్బరిని ఎక్కువగా తినకుండా కాస్త ముదురుగా ఉండే కొబ్బరిని తింటుంటాం. కొందరైతే ఎండుకొబ్బరిని ఎక్కువగా వాడుతుంటారు. లేత కొబ్బరితో పోల్చుకుంటే ఎండు కొబ్బరిలో పోషకాలు కాస్త అదనంగానే ఉంటాయని చెప్పవచ్చు. అయినా కూడా ఆరోగ్యరీత్యా మాత్రం ఎండుకొబ్బరికంటే లేత కొబ్బరే మంచిది. లేత కొబ్బరిలో రకరకాల ఎంజైములు ఉండడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు... శరీరంలో కొవ్వు తగ్గాలనుకునేవారు లేత కొబ్బరిని ఎక్కువగా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. లేత కొబ్బరి ఉపయోగాలు తెలిశాయికదా... చక్కగా మీ వంటల్లో కొబ్బరి వాడకం శాతాన్ని పెంచండి మరి.

  • Loading...

More Telugu News