: రామ్ లీలాను అడ్డుకున్న భజరంగ్ దళ్


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'రామ్ లీలా'ను భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ చిత్రంలో అనేక అశ్లీల సన్నివేశాలున్నాయని... దీనికి తోడు, హనుమాన్ డ్యాన్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమా ఈ రోజే దేశవ్యాప్తంగా విడుదలయింది.

  • Loading...

More Telugu News