: విభజనపై మండిపడ్డ మోడీ


కాంగ్రెస్ తీరుపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా విభజన చేపడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరైన విధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీయే హయాంలో ఎలాంటి హింస లేకుండా ఛత్తీస్ గఢ్ ఏర్పాటు జరిగిందని... ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ నేతలు తిరగగలిగే పరిస్థితులు లేవని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం తప్ప మరో పని లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో బంధుప్రీతి, అవినీతి, దుష్పరిపాలన పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉండేదని... ఇప్పుడు ఛత్తీస్ గఢ్ ను చూసి ఎవరైనా వెనుకబడిన రాష్ట్రమంటారా? అని సభికులను ప్రశ్నించారు. విభజన చేస్తే తమలా ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో, అందర్నీ ఒప్పించి చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News