: పతనం అంచున విండీస్.. 43/3
495 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అవడంతో... రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. గేల్ కు జతగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పావెల్ 15 పరుగుల వద్ద అశ్విన్ కు చిక్కాడు. తరువాత నైట్ వాచ్ మెన్ గా విండీస్ బౌలర్ బెస్ట్ బరిలోకి దిగాడు. అయితే అతను టీం స్కోరు 28 పరుగుల వద్ద ఓజాకు ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
అనంతరం గేల్ కు జత కలిసిన బ్రావో ను అశ్విన్ 43 పరుగుల వద్ద బలి తీసుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 270 పరుగులు వెనకబడి ఉంది. మరో మూడు రోజుల ఆట ఇంకా మిగిలి ఉంది.