: కొడుకు పుట్టినప్పుడు ఆందోళన చెందామంటున్న నమ్రత


కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు తాను, మహేష్ చాలా ఆందోళన చెందామని హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తెలిపింది. నెలలు నిండకముందే తక్కువ బరువు (1.46 కేజీలు)తో గౌతమ్ పుట్టడంతో అందరిలాగే తమ కొడుకు శారీరక, మానసిక ఎదుగుదలపై ఆందోళన చెందామని చెప్పింది. 'వరల్డ్ ప్రిమోచ్యూర్ డే' సందర్భంగా హైదరాబాదులోని హోటల్ తాజ్ డెక్కన్ లో ఈ రోజు ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నమత్ర ఈ విషయాలను పంచుకుంది. నెలలు నిండక ముందే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడడంలో వైద్యులు చేస్తున్న కృషి మరిచిపోలేనిదని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News