: తెలంగాణకు నష్టం జరిగితే సీఎంకు ఎందుకు బాధ? : పొన్నం
హైదరాబాద్ శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగితే సీఎంకు ఎందుకంత బాధ? అని ప్రశ్నించారు. నల్గొండకు అన్యాయం చేసి చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లాలనుకున్నప్పుడు బాధ కలుగలేదా? అని ప్రశ్నించారు. జీవోఎంకు ముఖ్యమంత్రి పంపింది ఆయన వ్యక్తిగత నివేదికే అని చెప్పారు.