: టీమిండియా@400
భారత్ విండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నాలుగువందల పరుగుల భారీ స్కోరు సాధించింది. సచిన్, కోహ్లీలు అర్థసెంచరీలతో పుజారా సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 400 పరుగులు సాధించింది. క్రీజులో అర్థసెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ శర్మ(40)కు జతగా అశ్విన్ (26) ఉన్నాడు.