: జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచార యత్నం
జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచార యత్నం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. హైదరాబాదు, జూబ్లీహిల్స్ సమీపంలోని రెహమత్ నగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ పై సెట్టింగ్ అసిస్టెంట్ సురేష్ ఈ రోజు అత్యాచారానికి యత్నించాడు. జరిగిన ఘటనను జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు తెలియజేసింది. పోలీసులు నిందితుడు సురేష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.