: భద్రాచలం బంద్
ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలంటూ టీజేఏసీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్ ఈ తెల్లవారుజాము నుంచి కొనసాగుతోంది. గోదావరి వంతెన వద్ద తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలంటూ నినాదాలు చేశారు. భద్రాచలం నుంచి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. బంద్ సందర్భంగా వాహనాల రాకపోకలను కూడా తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు.