: దేశాన్ని అమ్ముకునే వాళ్ళ కంటే, టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావడమే నయం: మోడీ


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలపై చత్తీస్ గఢ్ ర్యాలీలో విమర్శనాస్త్రాలు సంధించారు. తన ప్రత్యర్థులకు దేశాన్ని నడిపించడం కంటే తనను పరిశీలించడానికే సమయం సరిపోతోందంటూ ఎద్దేవా చేశారు. 'కాంగ్రెస్ నేతలు టీవీల ముందు కూర్చుని మోడీ ఏం చేస్తున్నాడు.. ఏం చెబుతున్నాడంటూ చూస్తున్నారు' అన్నారు. టీ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధాని కాలేడంటూ కొన్ని రోజుల కిందట ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై కూడా మోడీ స్పందించారు. టీ విక్రయదారుడు ప్రధాని అవుతాడా? లేదా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దేశాన్ని అమ్ముకునే వ్యక్తులు ప్రధాని కావడం కంటే టీని అమ్ముకునేవారు ప్రధాని కావడమే నయమని చురక అంటించారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి వ్యవస్థాగత సమస్యలు అడ్డుపడుతున్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కూడా మోడీ మాట్లాడారు. ఎవరు వీటిని సృష్టించారని రాహుల్ ను ప్రశ్నించారు. 'మీ తండ్రి, మీ నాయనమ్మ స్వప్రయోజనాల కోసం వీటిని సృష్టించారు' అని మోడీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News