: చిచ్చర పిడుగు ఈ బాలిక


చిన్న వయసులోనే బాలలు అద్భుతాలు చేస్తున్నారు. తమకు ఇష్టమైన రంగంలో పెద్దలకు దీటుగా దూసుకుపోతూ తామే గ్రేట్ అని నిరూపించుకుంటున్నారు. 22 ఏళ్ల వయసులో సాధించాల్సినదాన్ని 13 ఏళ్లకే సాధించి చిచ్చర పిడుగు అనిపించుకుంది ఈ బాలిక. సుష్మావర్మ కేవలం 13 ఏళ్లకే లక్నో యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో పీజీ విద్యనభ్యసించేందుకు చేరింది. ఏడేళ్లకే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన సుష్మావర్మ అన్న కూడా బాలజ్ఞానే. సుష్మకు రెండేళ్లప్పుడు ఆమె తొమ్మిదేళ్ల అన్న పదోతరగతి పాసయ్యాడు. 14 ఏళ్లకే బీసీఏ పూర్తి చేశాడు.

అన్నను స్పూర్తిగా తీసుకున్న సుష్మ ఏడేళ్లకే పదో తరగతి పూర్తి చేసింది. తరువాత బీఎస్సీ పూర్తి చేసింది. మానవ శరీరంలో జరిగే మార్పులను స్టడీ చేయాలనే కోరికతో మైక్రోబయాలజీ ఎంచుకున్నానని చెబుతున్న సుష్మకు డాక్టర్ కావాలన్నది ప్రగాఢ కోరిక. 17 ఏళ్లు నిండితేకానీ మెడిసిన్ కు అర్హురాలు కాకపోవడంతో అంతవరకు ఖాళీగా ఉండకుండా పీహెచ్ డీ చేస్తానంటోందీ చిచ్చరపిడుగు.

  • Loading...

More Telugu News