: 100 పరుగుల ఆధిక్యంలో భారత్.. లంచ్ సమయానికి 282/3


భారత్, విండీస్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టులో భారత జట్టు రెండో రోజు లంచ్ విరామానికి వంద పరుగుల ఆధిక్యం సాధించింది. ధాటిగా ఆడే క్రమంలో 221 పరుగుల వద్ద మూడో వికెట్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అవుటవ్వడంతో పుజారా, కోహ్లీలు భారత ఇన్నింగ్స్ ను నడిపించారు. ఛటేశ్వర్ పుజార(85) సెంచరీకి చేరువవుతుండగా కోహ్లీ(36) ఆకట్టుకుంటున్నాడు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News