: వోల్వో బస్సు ప్రమాద మృతులకు పరిహారం ఇవ్వండి: కుటుంబసభ్యులు
మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో చోటు చేసుకున్న వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది మరణించిన సంగతి తెలిసిందే. వారికి నష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. అయితే, ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో... ఇప్పుడు వారి కుటుంబసభ్యులు న్యాయం చేయాలని కోరుతున్నారు. వెంటనే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు.