: సచిన్ ఔట్.. భారత్ 235/3
భారత్, విండీస్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టులో 221 పరుగుల వద్ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అవుటయ్యాడు. రెండో రోజు ఆట ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన బ్యాటింగ్ దిగ్గజం అర్థ సెంచరీ తరువాత జోరు పెంచాడు. దీంతో 74 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద స్యామీ బౌలింగ్ లో ఫస్ట్ స్లిప్ లోని డియోనరైన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సచిన్ ఔటైన సందర్భంలో స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. అంతకు ముందు పూజారా అర్థ శతకం సాధించగా పూజారా(66)కు జతగా కోహ్లీ(9) క్రీజులో ఉన్నాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది.