: మావోయిస్టులతో చేతులు కలిపిన పోలీసు అధికారి అరెస్ట్
వామపక్ష తీవ్రవాదం నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఓ అధికారి ఇంటిదొంగగా మారాడు. బీహార్లో భద్రత సిబ్బందికి చెందిన కీలక సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఆర్ఫీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంజయ్ కుమార్ యాదవ్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రత దళాల గాలింపు చర్యల సమాచారాన్ని ముందుగానే సంజయ్ తన ఫోన్ ద్వారా మావోయిస్టులకు సమాచారం అందించేవారని ఎస్టీఎఫ్ అధికారులు వెల్లడించారు.