: సచిన్ అర్ధ సెంచరీ.. భారత్ 183/2
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు(157/2)తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ధాటిగా ఆడుతోంది. తొలి ఓవర్ లోనే రెండు ఫోర్లు బాదిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తన ఉద్దేశ్యమేమిటో చెప్పకనే చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ చూడ ముచ్చటైన స్ట్రైట్ డ్రైవ్ ఫోర్ తో అర్ధసెంచరీ సాధించాడు. ఈ క్రమంలో భారత జట్టు రెండో రోజు ప్రధమార్ధంలో 2 వికెట్ల నష్టానికి విండీస్ సాధించిన 182 స్కోరును దాటింది. తొలి రోజు భారత బౌలర్ల ధాటికి తోకముడిచిన విండీస్ కేవలం 182 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి పుజారా(39), సచిన్(55) క్రీజులో ఉండగా, భారత్ స్కోరు 183/2కు చేరుకుంది.