: ఆరెంజ్‌ కన్నా గులాబీ మిన్న...


వజ్రాలంటే ఇష్టపడేవారు ఎవరుండరు... కాకపోతే వాటిని కొనేవారు మాత్రం చాలా తక్కువ మంది. వజ్రాలను ఎక్కువగా సంపన్నులే సొంతం చేసుకుంటుంటారు. అందునా అరుదైన వజ్రాలంటే ఇక చిన్నా చితకా ధనవంతులు అసలు వాటి లెక్కలోకి కూడా రారు.

మొన్నటికి మొన్న ఆరెంజ్‌ కలర్‌ వజ్రం అత్యంత ధర పలికింది. 14.82 కేరట్లున్న ఆరెంజ్‌ వజ్రాన్ని బుధవారం నాడు క్రిస్టీ జ్యూవెల్స్‌ సంస్థ వేలం వేస్తే 35.5 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు 228.6 కోట్ల రూపాయలకు ఇది అమ్ముడుపోయింది. అదేరోజు మరో అరుదైన వజ్రాన్ని వేలం వేస్తే అది ఆరెంజ్‌ను తలదన్నేంత ధర పలికింది. పింక్‌స్టార్‌గా పిలిచే 59.6 కేరట్‌ల గులాబీ వజ్రాన్ని బుధవారం నాడు సోత్‌బీ సంస్థ జెనీవాలో వేలం వేయగా ఇది రూ.524 కోట్లకు అమ్ముడుపోయిందట.

  • Loading...

More Telugu News