: కొటే వెంకటేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన చిరంజీవి, రామ్ చరణ్
గత నెల 30న మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దుర్ఘటనలో సజీవదహనమైన అఖిల కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు కొటే వెంకటేష్ కుటుంబసభ్యులను ఈ రోజు కేంద్రమంత్రి చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి బెంగళూరులోని వెంకటేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి విలేఖరులతో మాట్లాడుతూ వెంకటేష్ తన అభిమాని, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా హాజరయ్యేవారని అన్నారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసినట్టు పేర్కొన్నారు. వెంకటేష్ కుటుంబసభ్యులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ముందుండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్ లను చూసేందుకు పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.