: సచిన్ మేనియాతో ఊగిపోతున్న దేశం


తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు నూరుకోట్ల భారతీయులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో సచిన్ అభిమానులు ఏదో రకంగా సచిన్ ను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంకి ప్రముఖులు, అభిమానులు పోటెత్తగా.. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంతకాల సేకరణ చేపట్టారు. పలు స్కూళ్లలో విద్యార్థులు సచిన్ మాస్క్ లు ధరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఒరిస్సాలోని పూరీ బీచ్ లో సుదర్శన్ పట్నాయక్ సచిన్ కు సైకత శిల్పంతో 'అల్ ది బెస్ట్' చెప్పారు. విశాఖ బీచ్ లో ఏయూకి చెందిన ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు శాండ్ స్మారకంతో విషెస్ చెప్పారు. మరికొన్ని చోట్ల బెలూన్లు ఎగురవేసి అభినందనలు తెలిపారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్ సచిన్ కు గౌరవ సూచకంగా సచిన్ మెనూతో వంటకాలను సిద్ధం చేసి అతిథులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News