: విభజనపై హైకోర్టుకు వెళతాం: అశోక్ బాబు
రాష్ట్ర విభజనపై హైకోర్టుకు వెళతామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అయితే, తెలంగాణ బిల్లు ముసాయిదా వచ్చాకే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాగా, 17న ఏలూరులో లక్షమందితో రైతు గర్జన నిర్వహిస్తామని చెప్పారు. 19న పాలకొల్లు, 20న అమలాపురం, 28న కడప, డిసెంబర్ 2న మదనపల్లిలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని, అవసరమైతే ఈ నెల 25న ప్రభుత్వాన్ని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలనే అంశంపైనా చర్చిస్తామన్నారు. ఇన్ని వివాదాల మధ్య రాష్ట్ర విభజన జరగదని భావిస్తున్నానన్న అశోక్ బాబు... సీఎం మారినా తమ అభిప్రాయం మారదని స్పష్టం చేశారు. కొత్త సీఎం వచ్చినా సమైక్యానికే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.