: బిల్లు పెడతాం.. చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే
తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని, అయితే అది చర్చకు వస్తుందో రాదో తాను చెప్పలేనని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో బాలల చిత్రోత్సవం ప్రారంభం కారణంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ వాయిదా పడిందని అన్నారు. అలాగే, వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో తానిప్పుడే చెప్పలేనని షిండే స్పష్టం చేశారు. అయితే తెలగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని మాత్రం షిండే చెప్పడం విశేషం.