: మలయాళ నటుడు అగస్టీన్ మృతి
మలయాళ నటుడు అగస్టీన్ (58) ఈ ఉదయం మృతి చెందారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేపు (శుక్రవారం) అగస్టీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మూడేళ్ల కిందట ఆయనకు గుండె నొప్పి వచ్చింది. ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వందకు పైగా మలయాళం చిత్రాల్లో నటించిన అగస్టీన్ స్వయంకృషితో చిత్ర రంగంలో నిలదొక్కుకున్నారు.