: యూపీఏని ఇంటికి పంపేందుకే ప్రజలు నిర్ణయించారు: మోడీ
యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు నిర్ణయించారని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బెమెటరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అభివృద్ధి నినాదంతోనే ముందుకెళ్తామని అన్నారు. ఛత్తీస్ గఢ్ మరింత అభివృద్ధి సాధించే దిశగా రమణ్ సింగ్ కు మరో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.