: నేను సీఎం రేసులో లేను: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ


తాను సీఎం రేసులో లేనని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సోనియా నుంచి తనకు ఆహ్వానం అందలేదని అన్నారు. తానే అపాయింట్ మెంట్ తీసుకుని సోనియా గాంధీని కలిశానన్నారు. సీఎం పదవి కోసం తాను ప్రయత్నించడం లేదని ఆయన తెలిపారు. విభజన సరికాదని సూచించేందుకే తాను సోనియా గాంధీని కలిశానని చెప్పారు. అయితే ఈ దశలో వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని సోనియా గాంధీ తనకు చెప్పారని అన్నారు. విభజన అనివార్యమయితే సీమాంధ్రకు న్యాయం చేయాలని సోనియాకు తాను సూచించానని కన్నా తెలిపారు. తన ప్రతిష్ఠ దిగజార్చే కుట్ర జరుగుతోందని, అందుకే తాను సీఎం రేసులో ఉన్నాననే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News