: తమిళుల సెంటిమెంట్ గురించి మన్మోహన్ తన లేఖలో పేర్కొనలేదు: రాజపక్సే
కొలంబోలో జరగనున్న కామన్వెల్త్ దేశాధ్యక్షుల సమావేశానికి హాజరుకాలేనంటూ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మన్మోహన్ స్థానంలో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సమావేశానికి రాకపోవడం గురించి ఒక విలేకరి రాజపక్సే స్పందన కోరాడు. మన్మోహన్ రాకపోయినా ఖుర్షీద్ వచ్చారని... తాను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందానని రాజపక్సే చెప్పారు. గతంలో కూడా మన్మోహన్ ఒకసారి పెర్త్ లో జరిగిన సమావేశాలకు హాజరుకాలేదని గుర్తుచేశారు. సమావేశానికి రాలేనంటూ మన్మోహన్ రాసిన లేఖలో... తమిళుల సెంటిమెంట్ గురించి ప్రస్తావించలేదని తెలిపారు.