: టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కాలేరు : సమాజ్ వాది పార్టీ
టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి దేశ ప్రధాని కాలేరని సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత నరేష్ అగర్వాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి సభలో ప్రసంగిస్తూ... నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి... దేశం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. కానిస్టేబుల్ గా పనిచేసే వ్యక్తిని ఎస్పీని చేస్తే... అతను ఎస్పీగా విధులు నిర్వహించగలడా? అన్నారు. ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడే వ్యక్తికి... అత్యున్నత స్థాయి ఉండాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరో వివాదానికి తెరలేపాయి.