: ఆరుషి సినిమా 'రహస్య'కు హీరోయిన్ దొరికింది


దారుణ హత్యకు గురైన ఆరుషి జీవితగాథపై రాబోతున్న సినిమా 'రహస్య'కు హీరోయిన్ దొరికింది. మనీష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆరుషి పాత్రకు సాక్షి సేమ్ అనే అమ్మాయిని ఎంచుకున్నారు. 18 ఏళ్ల వయసున్న సాక్షి ఇప్పటికే రాంగోపాల్ వర్మ నిర్మించిన 'డర్నా జరూరీ హై' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ సినిమాకు మనీష్ గుప్తా డైరెక్టర్ గా పనిచేశాడు. దీంతో పాటు, అజయ్ దేవగణ్ సినిమా 'రాజు చాచా'లో కూడా సాక్షి నటించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యను కథాంశంగా ఎంచుకుని మనీష్ 'రహస్య' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఆరుషి పాత్రకు సరిపోయే అమ్మాయికోసం అతను గత కొంతకాలంగా వెతుకుతున్నాడు. చివరకు తనతో పని చేసిన సాక్షినే సెలెక్ట్ చేసుకున్నాడు. రహస్య సినిమా ద్వారా... నగరాల్లోని టీనేజ్ అమ్మాయిల సంఘర్షణను చూపించనున్నట్టు మనీష్ గుప్తా తెలిపాడు. తల్లిదండ్రులతో సంబంధాలు, శారీరక సంబంధాల కోసం ఇతరుల నుంచి ఒత్తిడి లాంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తామని మనీష్ చెప్పాడు.

  • Loading...

More Telugu News