: బలపడుతున్న వాయుగుండం
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి 550 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 16న ఇది నాగపట్నం-చెన్నైల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు సాయంత్రం నుంచి కోస్తా తీరప్రాంతంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని... చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.