: క్రిస్ గేల్ వికెట్ కోల్పోయిన విండీస్
ముంబైలో ప్రారంభమైన రెండో టెస్టులో విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ వికెట్ ను విండీస్ కోల్పోయింది. 17 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 11 పరుగులు చేసిన గేల్... షమీ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 పరుగులతో ఆడుతున్న కీరన్ పావెల్ కు డారెన్ బ్రావో జతకలిశాడు.