: అటార్నీ జనరల్ కు జీవోఎం పిలుపు
అటార్నీ జనరల్ వాహనవతి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి బి.ఎ.అగర్వాల్, శాసన వ్యవహారాల కార్యదర్శి పి.కె.మల్హోత్రాలకు జీవోఎం నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు తమ ముందు హాజరు కావాలని సమాచారం పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి లోని కీలకాంశాలపై న్యాయపరమైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి వీరిని భేటీకి పిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెడితే సరిపోతుందా? లేక ఆర్టికల్ 371-డి కి సంబంధించి మరో బిల్లు అవసరమా? అన్న అంశాలపై అటార్నీ జనరల్ సలహాలు తీసుకోనున్నట్టు సమాచారం.