: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా
ముంబై వాంఖడే స్టేడియంలో భారత్, వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో... భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 200వ టెస్ట్ ఆడుతున్న సచిన్ కు ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు స్టేడియంకు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.